మంచు చరియలు విరిగిపడి 124 మంది మృతి | 124 died in snow landslide in afghanistan | Sakshi
Sakshi News home page

మంచు చరియలు విరిగిపడి 124 మంది మృతి

Published Thu, Feb 26 2015 1:45 AM | Last Updated on Sat, Sep 2 2017 9:54 PM

మంచు చరియలు విరిగిపడి 124 మంది మృతి

మంచు చరియలు విరిగిపడి 124 మంది మృతి

కాబూల్: అప్ఘానిస్థాన్‌లోని పంజ్‌షిర్ రాష్ట్రంలో మంచుచరియలు విరిగిపడి 124 మంది సజీవ సమాధి అయ్యారు. నాలుగు రాష్ట్రాల్లో వంద ఇళ్లు  మంచులో కూరుకుపోయినట్లు అప్ఘాన్ పర్యావరణ విపత్తుల సంస్థ అధికారి అస్లాం తెలిపారు. పంజ్‌షిర్‌లో మంగళవారం అవిశ్రాంతగా కురుస్తున్న మంచుతో అన్ని ప్రదేశాల్లో దాదాపు మూడడుగుల మేర మంచు పేరుకుపోయింది. దారా జిల్లాలోని లోయ ప్రాంతంలో చిక్కుకున్న ఆరువందల కుటుంబాలను రక్షించడానికి స్థానికులు ప్రయత్నిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement