భారతీయుల హవా | 15 Indian origin MPs in new UK Parliament | Sakshi
Sakshi News home page

భారతీయుల హవా

Dec 14 2019 4:05 AM | Updated on Dec 14 2019 5:11 AM

15 Indian origin MPs in new UK Parliament - Sakshi

బ్రిటన్‌ పార్లమెంటుకి జరిగిన ఎన్నికల్లో భారతీయం వెల్లి విరిసింది. భారత సంతతికి చెందిన 15 మంది సభ్యులు హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌కు ఎన్నికై కొత్త రికార్డు నెలకొల్పారు. అటు అధికార కన్జర్వేటివ్‌ పార్టీ, ఇటు ప్రతిపక్ష లేబర్‌ పార్టీ నుంచి ఏడుగురు చొప్పున విజయం సాధించారు. లిబరల్‌ డెమొక్రాట్‌ పార్టీ తరఫున మరొకరు ఎన్నికయ్యారు. 12 మంది తమ సీట్లను నిలబెట్టుకుంటే ముగ్గురు కొత్తగా పార్లమెంటులో అడుగుపెట్టనున్నారు.

కన్జర్వేటివ్‌ పార్టీ తరఫున పోటీపడిన సిట్టింగ్‌ ఎంపీలందరూ తమ స్థానాలను నిలబెట్టుకోగా గగన్‌ మహీంద్రా, క్లెయిర్‌ కౌతినో కొత్తగా ఎన్నికయ్యారు. లేబర్‌ పార్టీ నుంచి మొదటిసారిగా నవేంద్రూ మిశ్రా కొత్తగా పార్లమెంటులో అడుగు పెట్టబోతుండగా లిబరల్‌ డెమొక్రాట్‌ తరఫు మునీరా విల్సన్‌ ఎన్నికయ్యారు. ఈసారి ఎన్నికల్లో విజయం సాధించిన ప్రతీ 10 మందిలో ఒకరు మైనార్టీ వర్గానికి చెందినవారు. బ్రిటన్‌లో 15 లక్షల మంది వరకు ప్రవాస భారతీయులున్నారు. వీరంతా కన్జర్వేటివ్‌ పార్టీకి  అనుకూలంగా ప్రచారం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement