లాహోర్ : ముంబైదాడుల సూత్రధారి హఫీజ్ మరోసారి భారత్ మీద విషం కక్కాడు. భారత్ నుంచి కశ్మీర్‌ను వేరు చేయడానికే జీహాద్‌ను కొనసాగిస్తున్నట్ల చెప్పారు. లాహోర్‌లో జమాతే ఉద్ దవా మద్దతుదారులతో శనివారం హఫీజ్ మాట్లాడారు. ఈ సందర్భంగా 1971 యుద్ధానికి భారత్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని జమాతే కార్యకర్తలకు పిలుపునిచ్చారు. యుద్ధంలో భారత్‌ను ఓడించి.. కశ్మీర్‌కు స్వేచ్ఛ ప్రసాదించాలని మద్దతుదారులకు చెప్పారు.
బంగ్లాదేశ్ విమోచన యుద్ధంపై భారత్‌పై ప్రతీకారం తీర్చుకునేందుకు ప్రతి పాకిస్తానీ ఎదురు చూస్తున్నాడని.. ఆ రోజు ఎంతో దూరం లేదని హఫీజ్ పేర్కొనడం విశేషం. తూర్పు పాకిస్తాన్‌ను.. పాకిస్తాన్ నుంచి విడదీనట్టు.. భారత్ నుంచి కశ్మీర్‌ను వేరు చేయాలని చెప్పారు. కశ్మీర్ విమోచనమే అసలైన ప్రతీకారమని హఫీజ్ సయీద్ తన మద్దతాదారులతో అన్నారు. డిసెంబర్ 16న భారత్, బంగ్లాదేశ్‌లు విజయ్ దివస్‌గా జరుపుకోవడంపై హఫీజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదిలా ఉండగా బంగ్లాదేశ్ విమోచన యుద్ధంలో.. పాకిస్తాన్‌పై భారత్ అద్వితీయ విజయం సాధించింది. పాకిస్తాన్‌కు చెందిన లక్ష మంది సైనికులను భారత సైన్యం.. యుద్ధఖైదీలకు బంధించింది. తరువాత జరిగిన ఒప్పందాల్లో భారత్ పెద్ద మనసుతో వారికి క్షమాభిక్ష ప్రసాదించి వదలిపెట్టిన విషయం విదితమే.
Comments
Please login to add a commentAdd a comment