వాషింగ్టన్: పాకిస్తాన్‌ను ఎంతగా హెచ్చరిస్తున్నా లెక్క చేయడం లేదని అమెరికా మండిపడుతోంది. ఉగ్రవాదులను నియంత్రించాలంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎన్నిసార్లు హెచ్చరించినా పాక్ వైఖరిలో మార్పు రావడం లేదని అమెరికా ఆర్మీ జనరల్ జాన్ నికోల్‌సన్ అసహనం వ్యక్తం చేశారు. ఉగ్రవాదం, దేశంలోని ఉగ్రవాదులపై ఉక్కుపాదం మోపాలని.. లేని పక్షంలో అమెరికా రంగంలోకి దిగాల్సి ఉంటుందని ట్రంప్ పదే పదే హెచ్చరించినా పాక్ తీరులో మార్పు లేదన్నారు.
'హక్కానీ నెట్‌వర్క్, ఇతర మిలిటెంట్ సంస్థలకు పాక్ స్వర్గధామంగా మారింది. ఈ నేపథ్యంలో ఇటీవల కిడ్నాప్‌నకు గురైన అమెరికా-కెనడా దంపతులను అఫ్ఘనిస్తాన్‌లోని ఉగ్రవాదుల నుంచి రక్షించాలన్న అమెరికా విజ్ఞప్తి మేరకు పాక్ ఆ సాయం చేసినందుకు ఎంతగానో సంతోషించాం. అదే సమయంలో ఉగ్రవాదులపై ఉక్కుపాదం మోపితేనే పాక్‌తో అమెరికా సంబంధాలు మెరుగ్గా ఉంటాయని అధ్యక్షుడు ట్రంప్ ఆ దేశానికి సూచించారు. కాగా, నేటికీ పాకిస్తాన్ గూఢచార సంస్త ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ).. ఉగ్రసంస్థ హక్కానీ నెట్‌వర్క్‌తో సంబంధాలు కొనసాగిస్తుందని గుర్తించాం. పాక్‌లో ఉగ్రవాదుల ఏరివేతకు రంగం సిద్ధం చేయాలని అమెరికా పదే పదే హెచ్చరిస్తున్నా.. పాక్ కాలయాపన చేయడంపై అమెరికాలో విస్తృతస్థాయిలో చర్చ జరిగే అవకాశాలున్నాయని' జాన్ నికోల్‌సన్ అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment