బీజింగ్ : సూపు ట్రేలో పడ్డ లైటర్‌ను తీయటానికి ప్రయత్నించిన ఓ వెయిట్రెస్ ముఖంపై ప్రమాదవశాత్తు సూపు ఎగిసి పడింది. దీంతో ఆమె ముఖం తీవ్రంగా కాలిపోయింది. ఈ సంఘటన చైనాలోని కున్‌మింగ్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. యునాన్ అనే వ్యక్తి కున్‌మింగ్‌లోని హాయ్‌దిలావో రెస్టారెంట్‌లో భోజనం చేయటానికి వెళ్లాడు. భోజనం చేస్తున్న సమయంలో అనుకోకుండా అతడి లైటర్ పక్కనే ఉన్న సూపు ట్రేలో పడిపోయింది. దీంతో అక్కడే ఉన్న వెయిట్రెస్‌ను పిలిచి, దాన్ని బయటకు తీయవల్సిందిగా కోరాడు. ఆమె రెండు స్పూన్‌ల సహాయంతో దాన్ని బయటకు తీసే ప్రయత్నం చేయసాగింది.
ఈ నేపథ్యంలో సూపులో పడిఉన్న లైటర్ ఒక్కసారిగా పేలింది. దీంతో వేడివేడి సూపు పెళ్లున ఎగిసి ఆమె ముఖంపై పడింది. అంతేకాకుండా పక్కన ఉన్న వాళ్లపై కూడా పడింది. వేడిగా ఉన్న సూపు పెద్దమొత్తం ముఖంపై పడటంతో ఆమె ఆర్తనాదాలు చేసింది. ముఖానికి తీవ్రమైన గాయాలు కావటంతో ఆమెను దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Comments
Please login to add a commentAdd a comment