గర్భిణులకు బ్రెజిల్ హెచ్చరికలు... | Brazil urges pregnant women to avoid Olympics over Zika | Sakshi
Sakshi News home page

గర్భిణులకు బ్రెజిల్ హెచ్చరికలు...

Published Tue, Feb 2 2016 9:12 AM | Last Updated on Sun, Sep 3 2017 4:49 PM

గర్భిణులకు బ్రెజిల్ హెచ్చరికలు...

గర్భిణులకు బ్రెజిల్ హెచ్చరికలు...

బ్రసీలియా: జికా వైరస్ లాటిన్ అమెరికా దేశాలను హడలెత్తిస్తోంది. ముఖ్యంగా బ్రెజిల్ పై జికా మహమ్మారి గతేడాది తీవ్ర ప్రభావం చూపిన విషయం తెలిసిందే. బ్రెజిల్ అధ్యక్షురాలు ఈ విషయంపై తీవ్ర ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది బ్రెజిల్ లోని రియోడిజనీరోలో సమ్మర్ ఒలింపిక్స్ జరగున్నాయి. అయితే, గర్భిణులు ఒలింపిక్ గేమ్స్ చూసేందుకు బ్రెజిల్ రావద్దని ఆ దేశ క్యాబినెట్ చీఫ్ జాక్వెస్ వాంగెర్ హెచ్చరించారు. అధ్యక్షురాలు దిల్మా రౌసెఫ్ నిర్ణయం మేరకు ఉన్నతాధికారులు ఈ విషయాన్ని వెల్లడించారు. జికా వైరస్ గర్భిణులకు వ్యాపించినట్లయితే వారికి పుట్టబోయే పిల్లలు చిన్న తలతో పుట్టడం, ఇతర ప్రమాదకర వ్యాధులు చిన్నారులకు సంక్రమిస్తాయని తెలిపారు.

దోమల కారణంగా వ్యాపిస్తున్న జికా వైరస్ పెను సవాలుగా మారిందని భావించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ విషయంపై ఎమర్జెన్సీ ప్రకటించింది. 1947లో ఆఫ్రికాలో కనుగొన్న జికా వైరస్ ఇటీవల కాలంలో వైద్యశాస్త్రానికి ఓ ప్రశ్నగా మిగిలింది. 2014లో 147 కేసులు నమోదవ్వగా, 2015లో 4000 వేల మంది జికా బారిన పడ్డారు. ఈ నేపథ్యంలో జికా వ్యాప్తిని అరికట్టడానికి, ముఖ్యంగా గర్భిణులు చాలా జాగ్రత్తగా ఉండాలని ఒలింపిక్స్ కోసం ఇక్కడకు రావద్దంటూ క్యాబినెట్ చీఫ్ జాక్వెస్ వాంగెర్ హెచ్చిరికలు జారీచేశారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement