ఏడాది చివరికి ‘ఎంఐ–17’ ఒప్పందం పూర్తి
జుకోవ్‌స్కీ(రష్యా): ఎంఐ–17 మిలటరీ రవాణా హెలికాప్టర్ల కొనుగోలు ఒప్పందానికి సంబంధించి భారత్‌తో చర్చలు జరుపుతున్నట్లు రష్యా ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. ఈ ఏడాది చివరినాటికల్లా 48 ఎంఐ–17 చాపర్ల కొనుగోలు ఒప్పందం పూర్తవుతుందని తెలిపారు.
ఎంఐ–8, ఎంఐ–17 మోడల్స్‌కు చెందిన 300కు పైగా మిలటరీ హెలికాప్టర్లు భారత్ వద్ద ఉన్నాయని, మరో 48 ఎంఐ–17 హెలికాప్టర్ల కోసం రష్యాతో భారత్ చర్చలు జరుపుతోందని రోసోబోరాన్ ఎక్స్‌పోర్ట్స్ సీఈవో అలెగ్జాండర్ మైఖీవ్ తెలిపారు. 2008లో 80 ఎంఐ–17 చాపర్లను భారత్‌కు విక్రయించేందుకు ఒప్పందం కుదుర్చుకున్న రోసోబోరాన్ ఎక్స్‌పోర్ట్స్.. 2011–13లో వాటిని అందజేసింది. 2012–13లో మరో 71 చాపర్ల కోసం భారత్ మూడు అదనపు ఒప్పందాలు కుదుర్చుకుంది.