
కెమెరాకు చిక్కిన ఆకాశంలో అద్భుతం!
మంగళవారం అర్ధరాత్రి 12.50 గంటల సమయం. ఇద్దరు పోలీసు అధికారులు మాట్లాడుకుంటున్నారు.
మంగళవారం అర్ధరాత్రి 12.50 గంటల సమయం. ఇద్దరు పోలీసు అధికారులు మాట్లాడుకుంటున్నారు. ఇంతలో దూరంగా స్పీడ్‌గా వెళుతున్న వాహనాల్ని చిత్రీకరించడానికి వారిలో ఒకతను తన డాష్‌బోర్డు కెమెరా తీసి అటువైపు తిప్పాడు. ఇంతలో ఆకాశంలో అద్భుతం. నిప్పులు చిమ్ముతూ అగ్నిగోళాలు విశ్వం నుంచి భూమివైపుగా రాలిపడ్డాయి. దీంతో వెలువడిన ప్రకాశవంతమైన మెరుపు చాలా స్పష్టంగా కెమెరాలో చిక్కింది. అమెరికాలో, కెనడాలోని కొన్ని ప్రాంతాల్లో ఈ అద్భుతం కనిపించింది. బహుశా ఒక ఉల్క రాలిపడిపోతూ భూ ఆవరణం సమీపంగా వచ్చి ఉంటుందని అంతరిక్ష నిపుణులు చెప్తున్నారు.
Police dashcam captures a meteor in the sky in the early hours of Tuesday in the US city of Portland, Mainehttps://t.co/NzV8krM1nj
— ITV News (@itvnews) 17 May 2016
పోర్ట్లాండ్ సెంట్రల్ ఫైర్ స్టేషన్‌కు చెందిన పోలీసు అధికారి టిమ్ ఫరీస్ కెమెరాలో ఈ అద్భుతం చిక్కింది. అదే సమయంలో ఆయనతోపాటు ఉన్న మరో అధికారి గ్రహం హల్ట్స్ 'ఓ మై గాడ్' అని అనడం ఈ వీడియోలో వినిపిస్తోంది. నిజానికి ఈ అంతరిక్ష అద్భుతాన్ని ఈ ఇద్దరు పోలీసు అధికారులే కాదు.. మైనీ, వెర్మోంట్, న్యూహాంప్‌షైర్, మసాచుసెట్స్, రోడె ఐలాండ్, కనెక్టికట్, న్యూయార్క్, న్యూజెర్సీ, పెన్సిల్వేనియా, కెనడాలోని కొన్ని ప్రాంతాల్లో వందలమంది చూశారు. చాలామంది ఈ అద్భుతాన్ని తమ కెమెరాలో బంధించి యుట్యూబ్లో పోస్టు చేశారు. ఒక ఫ్రిడ్జ్ పరిమాణంలో ఉన్న అంతరిక్ష రాయి (స్పేస్ రాక్) లాంటి వస్తువు ఏదో నిప్పులు చిమ్ముతూ కూలిపోయిందని, అది భూమికి చేరువగా రావడంతో ప్రకాశవంతమైన మెరుపుతో కాంతులు కనిపించాయని అమెరికా నావల్ అబ్జర్వేటరీ పేర్కొంది.