
బీజింగ్ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లద్దాఖ్ పర్యటపై చైనా ఘాటుగా స్పందించింది. ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన చర్చలు జరుగుతున్న తరుణంలో వివాదాస్పద ప్రాంతాల్లో పర్యటించడం సరైనది కాదని మోదీ పర్యటనపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. సరిహద్దు ప్రాంతాల్లో ఇరు దేశాల నడుమ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో భారత్ రెచ్చగొట్టేలా వ్యవహరిస్తోందని పేర్కొంది. ఈ మేరకు చైనా విదేశాంగ ప్రతినిధి చావో లిజియన్ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. (లద్దాఖ్‌లో మోదీ ఆకస్మిక పర్యటన)
శుక్రవారం ఉదయం మూడోకంటికి కూడా తెలియకుండా సీడీఎస్ చీఫ్ బిపిన్ రావత్‌తో కలిసి మోదీ లద్దాఖ్‌లోని నిము స్థానిక స్థావరంకు చేరుకున్న విషయం తెలిసిందే. జూన్ 15న గల్వాన్ లోయలో చేసుకున్న హింసాత్మక ఘటనపై గాయపడిన జవాన్లను పరామర్శించారు. వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) వెంట తాజా పరిస్థితుల గురించి ఆరా తీశారు. మరోవైపు మోదీ లద్దాఖ్ ఆకస్మిక పర్యటనతో చైనాతో పాటు పాకిస్తాన్, నేపాల్‌కు మోదీ గట్టి సందేశం ఇచ్చారు. (చైనాకు చెక్ : మరోసారి మోదీ మార్క్)
Comments
Please login to add a commentAdd a comment