
చైనా దోచుకుంటోంది: ట్రంప్
పిట్స్‌బర్గ్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి రేసులో ముందుకు దూసుకుపోతున్న డొనాల్డ్ ట్రంప్ చైనాపై మళ్లీ తీవ్ర ఆరోపణలు చేశారు. ‘చైనా స్వేచ్ఛా వాణిజ్యాన్ని దుర్వినియోగం చేస్తోంది. మేధో సంపత్తిని దొంగిలిస్తూ అమెరికాను దోచుకుంటోంది. నేను అధ్యక్షుణ్ని అయితే వారు తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదు’ అని ఆదివారం ఓ సభలో చెప్పారు.