ఆలయానికి జరిమానా వేశారు!
బీజింగ్: సింహాలను ఉంచారన్న ఆరోపణలతో ఓ దేవాలయానికి జరిమానా విధించారు. ఈ ఘటన చైనాలో శనివారం చోటుచేసుకుంది. షాంగ్ఘీ ప్రాంతంలోని ఓ బౌద్ధ దేవాలయంలో కొన్నేళ్లుగా సింహాన్ని ఉంచుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న అధికారులు దేవాలయానికి దాదాపు రూ.30 వేలు జరిమనా విధించారు.
ఆలయంలో ఉన్న సింహాన్ని 'జూ'కు తరలించినట్లు అధికారులు వెల్లడించారు. 2010లో ఈ దేవాలయానికి రెండు సింహాలను అప్పగించగా, ఓ సింహం అనారోగ్యంతో చనిపోయింది. రెండో సింహం ఆలయంలో ఉండిపోయింది. సింహాన్ని ఆలయప్రాంగణంలో ఎందుకు ఉంచుతున్నారని అధికారులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా సింహాన్ని ఆలయంలో బంధించడం విషయంపై విచారణ ప్రారంభించారు.