
'అతి పెద్ద ప్రజాస్వామ్యానికి ప్రతినిధిగా వచ్చా'
చట్టసభలనుద్దేశించి,అమెరికా కాంగ్రెస్లో ప్రధాని నరేంద్రమోదీ ప్రసంగించారు.
వాషింగ్టన్: చట్టసభలనుద్దేశించి,అమెరికా కాంగ్రెస్లో ప్రధాని నరేంద్రమోదీ ప్రసంగించారు. అమెరికా కాంగ్రెస్లో మాట్లాడటం గౌరవంగా భావిస్తున్నానని తెలిపారు. అమెరికా కాంగ్రెస్ ఇతర దేశాల పార్లమెంట్లకు ఆదర్శం అని కొనియాడారు. ఈ సందర్భంగా అబ్రహం లింకన్ సూక్తులను కొన్నింటిని మోదీ గుర్తు చేశారు.
ప్రపంచలో అతిపెద్ద ప్రజాస్వామ్యానికి ప్రతినిధిగా వచ్చానని మోదీ అన్నారు. ప్రజాస్వామ్య పునాదులే భారత్, అమెరికాకు బలం అని తెలిపారు. మానవజాతి శాంతియుత జీవనానికి అమెరికా ఎంతో కృషి చేసిందన్నారు. ఒబామా హయాంలో రెండు దేశాల బంధం మరింత బలపడిందన్నారు. అమెరికా కాంగ్రెస్ ప్రజాస్వామ్య దేవాలయంగా అభివర్ణించారు. తమ ప్రభుత్వానికి రాజ్యాంగమే పవిత్ర గ్రంథం అని మోదీ తెలిపారు.