న్యూఢిలీ/టోక్యో : కోవిడ్-19 (కరోనా వైరస్) భయంతో జపాన్‌లోని యెకోహూమా తీరంలో నిలిపివేసిన ‘డైమండ్ ప్రిన్సెస్’ నౌకలోని భారతీయుల పరిస్థితి రోజురోజుకు ఆందోళకరంగా మారుతుంది. ఇక్పటికే ఆ నౌకలోని ఇద్దరు భారతీయులకు కరోనా వైరస్ సోకిన సంగతి తెలిసిందే. తాజాగా మరో వ్యక్తికి కరోనా వైరస్ సోకినట్టు టోక్యోలోని భారత ఎంబసీ ధ్రువీకరించింది. ప్రస్తుతం బాధితులతో టచ్‌లో ఉన్నామని భారత ఎంబసీ అధికారులు తెలిపారు. ప్రస్తుతం వారికి ఆస్పత్రిలో చికిత్స అందుతుందని.. ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వెల్లడించారు.
ఆ నౌకలోని మొత్తం 3700 మందిలో 138 భారతీయులు ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు అందించిన సమాచారం ప్రకారం మొత్తంగా ఆ నౌకలోని 170 మందికి కరోనా వైరస్ సోకినట్టుగా తెలుస్తోంది. దీంతో ఆ నౌకలోని భారతీయులు తమను కాపాడాలని భారత ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. సాయం కోరుతూ పలువురు బాధితుల పంపిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మరోవైపు ఆ నౌకలోని భారతీయులు పరిస్థితిపై స్వదేశంలోని వారి కుటుంబ సభ్యులు, బందువుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. తమవారిని క్షేమంగా తీసుకురావాలని వారు కూడా భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment