సాక్షి, న్యూఢిల్లీ : ప్రాణాంతకమైన వైరస్ బారిన పడిన దేశాలన్నీ సెప్టెంబర్ లేదా డిసెంబర్ నాటికల్లా కరోనాకు యాంటీ వ్యాక్సిన్‌ను కనిపెడతామని ఆశావాద దృక్పథంతో ఉండగా, అసలు వ్యాక్సిన్‌ను ఎప్పటికీ కనుక్కోలేక పోవచ్చని, ప్రపంచ ప్రజానీకమంతా వైరస్‌తో కలిసే ప్రయాణం సాగించాల్సి రావచ్చని కొంత మంది వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కరోనా వైరస్‌పై పోరులో భాగంగా వైరస్ విజృంభించినప్పుడల్లా ప్రస్తుతం లాగానే లాక్‌డౌన్‌లు అమలు చేస్తూ తగ్గాక ఎత్తివేస్తూ రావడం ఎల్లప్పుడు కొనసాగే ప్రక్రియగా మారిపోవచ్చని వారంటున్నారు. (దేశంలో మరో వైరస్.. ఇది కూడా చైనా నుంచే!)
కరోనా వైరస్‌కు వ్యాక్సిన్‌ను తప్పనిసరిగా కనుగొంటామన్న గ్యారెంటీ ఏమీ లేదని, అసలు ఎప్పటికీ వ్యాక్సిన్ కనుక్కోలేక పోవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థకు ప్రత్యేక దౌత్యవేత్తగా పనిచేస్తోన్న లండన్ ఇంపీరియల్ కాలేజ్ ప్రొఫెసర్ డాక్టర్ డేవిడ్ నాబర్రో అన్నారు. మన శాస్త్రవేత్తలు ఓ యాంత్రిక వ్యవస్థలో కొత్త పరికరం కోసం పని చేయడం లేదని, జీవ వ్యవస్థపై పని చేస్తున్నందున విజయానికి గ్యారెంటీ ఇవ్వలేమని ఆయన చెప్పారు. వ్యాక్సిన్ కోసం ప్రపంచ వ్యాప్తంగా శాస్త్రవేత్తలపై ఒత్తిడి పెరిగిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. (వలస కార్మికులు: సోనియా కీలక నిర్ణయం)
ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ పరిశోధకులు చింపాంజీ వైరస్ నుంచి తయారు చేసిన వ్యాక్సిన్‌తో పరిశోధనలు నిర్వహిస్తోండగా, అమెరికా ఓ భిన్నమైన వ్యాక్సిన్‌తో పరిశోధనలు నిర్వహిస్తోంది. ప్రజలు భయాందోళనలకు గురి కాకుండా ఉండడం కోసం సెప్టెంబర్‌లో లేదా డిసెంబర్ నాటికల్లా వ్యాక్సిన్ వస్తుందని ప్రభుత్వాలు ఆశావాద దృక్పథంతో చెబుతూనే ఉంటాయని డాక్టర్ డేవిడ్ తెలిపారు. (లాక్‌డౌన్; జపాన్ కీలక నిర్ణయం)
Comments
Please login to add a commentAdd a comment