న్యూయార్క్: దాతల నుంచి సేకరించిన కార్నియాలను 11 రోజుల వరకు కూడా ఉపయోగించవచ్చని పరిశోధకులు గుర్తించారు. ఇప్పటి దాకా వారం రోజుల కార్నియాను మాత్రమే అమర్చేవారు. వారం దాటిన తర్వాత అయితే అవి సరియైన ఫలితాలనివ్వవని నమ్ముతూ వచ్చారు. అయితే, జొనాథన్ లాస్ వెస్టర్న్ రిజర్వ్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు సేకరించిన కార్నియాలను దాదాపు 11 రోజుల దాకా ఉపయోగించి మంచి ఫలితాలను సాధించగలిగారు.
ఇప్పటి వరకు ఆచరించిన విధానం కేవలం నమ్మకం పైనే ఆధారపడి ఉందని, దీనికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని చెప్పారు. అయితే తమ పరిశోధనలు ఈ పద్ధతిలో సమూల మార్పులు తేనున్నాయని వర్సిటీ పరిశోధకుడు జొనాథన్ లాస్ తెలిపారు. మూడేళ్లలో 1090 వ్యక్తులకు 11 రోజుల పాటు భద్రపరిచిన కార్నియాలతో విజయవంతంగా ఆపరేషన్ నిర్వహించినట్లు తెలిపారు. వారం రోజుల పాటు ఉన్న కార్నియాలతో ఆపరేషన్ సక్సెస్ రేట్ 95.3 శాతం ఉండగా 11 రోజుల పాటు ఉన్న కార్నియాలతో సక్సెస్ రేటు 92.1 శాతంగా ఉందని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment