లండన్: విమానం లోపల ఎలుకను గుర్తించడంతో ఇక్కడి హీత్రో విమానాశ్రయం నంచి అమెరికాకు వెళ్తోన్న బ్రిటిష్ ఎయిర్‌వేస్ విమానం ఒకటి నాలుగు గంటలు ఆలస్యంగా బయల్దేరింది. విమానం వైరింగ్‌ను ఎలుక కొరికే ప్రమాదం ఉన్నందున దాన్ని బయటికి పంపించిన తరువాతే విమానం టేకాఫ్‌కు అనుమతి ఇచ్చారు.
లోపల ఎలుక ఉండగా విమానం బయల్దేరదని, మరో విమానాన్ని సిద్ధం చేస్తామని సిబ్బంది ప్రకటించినా అది సాధ్యం కాలేదు. దీంతో ప్రయాణికులు నాలుగు గంటలు విమానాశ్రయంలోనే వేచి ఉండాల్సి వచ్చింది. చివరకు ఎలుకను బయటికి పంపించడంతో ఆ విమానం బయల్దేరింది. ఈ చిత్రమైన సంఘటన బుధవారం జరిగిందని బీబీసీ పేర్కొంది. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి బ్రిటిష్ ఎయిర్‌వేస్ క్షమాపణ చెప్పింది. ఈ సంఘటనపై స్పందించేందుకు హీత్రో విమానాశ్రయం నిరాకరించింది.
ఎలుక కారణంగా ఎగరని విమానం
Published Fri, Mar 3 2017 3:26 PM | Last Updated on Tue, Sep 5 2017 5:06 AM
Advertisement
Advertisement