కరోనా చికిత్సకు మందు.. ట్రంప్‌ ఆనందం! | FDA Authorized Remdesivir For Emergency Use Covid 19 Patients | Sakshi
Sakshi News home page

ఇది నిజంగా ఆశాజనక పరిస్థితి: ట్రంప్‌

Published Sat, May 2 2020 9:57 AM | Last Updated on Sat, May 2 2020 5:09 PM

FDA Authorized Remdesivir For Emergency Use Covid 19 Patients - Sakshi

బాధితులు త్వరగా కోలుకునేందుకు ఈ మెడిసిన్‌ తోడ్పడుతుందని తయారీ సంస్థ గిలీడ్‌ సైన్సెస్‌ వెల్లడించింది.

వాషింగ్టన్‌: కోవిడ్‌ బాధితుల చికిత్సలో పనిచేసే ప్రయోగాత్మ ఔషదం రెమ్‌డెసివిర్‌కు అమెరికా ఫుడ్‌ అండ్‌ డ్రగ్స్‌ అడ్మినిస్ట్రేషన్‌ అనుమతినిచ్చింది. కోవిడ్‌తో తీవ్రంగా ప్రభావితమైన రోగులకు అత్యవసర మెడిసన్‌గా రెమ్‌డెసివిర్‌ యాంటీ వైర‌ల్ ఇంజక్షన్‌ను వాడొచ్చునని తెలిపింది. ఇక కరోనా పుట్టుకొచ్చిన తర్వాత.. వైరస్‌ చికిత్సకు సంబంధించి క్లినికల్‌ ట్రయల్స్‌ జరుపుకొని బయటికొచ్చిన తొలి మెడిసిన్‌ ఇదే కావడం విశేషం. కోవిడ్‌ బాధితులు త్వరగా కోలుకునేందుకు ఈ మెడిసిన్‌ తోడ్పడుతుందని తయారీ సంస్థ గిలీడ్‌ సైన్సెస్‌ వెల్లడించింది. ఇక రెమ్‌డెసివిర్‌కు అనుమతులు వచ్చిన సందర్భంగా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆనందం వ్యక్తం చేశారు. ‘ఇది నిజంగా ఆశాజనక పరిస్థితి’అని పేర్కొన్నారు. 
(చదవండి: లాక్‌డౌన్‌ ఎత్తివేస్తే ఇక అంతే: డబ్ల్యూహెచ్‌ఓ)

వైట్‌ హౌజ్‌లో గిలీడ్‌ సైన్సెస్‌ సీఈఓ డానియెల్‌  ఓడేతో ఆయన ముచ్చటించారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న రోగుల బాగుకోసం ఇది తొలి అడుగు అని ఓడే పేర్కొన్నారు. నిస్వార్థంగా రెమ్‌డెసివిర్‌తో వారికి సేవ చేస్తామని చెప్పారు. కాగా, 1.5 మిలియన్‌ డోసుల మెడిసిన్‌ను ఉచితంగా అందిస్తామని గిలీడ్‌ సైన్సెస్‌ ఇదివరకే చెప్పింది. ఈ మెడిసిన్‌తో బాధితులు 31 శాతం త్వరగా కోలుకుంటారని అమెరికాలోని అలర్జీ అండ్‌ ఇన్‌ఫెక్చువస్‌ డిసీజెస్‌ వెల్లడించింది. ఇది వైరస్ యొక్క జన్యువులో కలిసిపోయి, దాని ప్రతిరూపణ ప్రక్రియను తగ్గించేస్తుందని తెలిపింది. కాగా, రెమ్‌డెసివిర్‌ను తొలుత ఎబోలాపై పోరుకు తయారు చేశారు. అయితే, మరణాలను తగ్గించడంలో ఈ మెడిసన్‌ ప్రభావం చూపలేదని వైద్య వర్గాలు తెలిపాయి.
(చదవండి: 20 రోజుల తర్వాత కనిపించిన కిమ్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement