రష్యాలో షాకింగ్ ప్రమాదం.. జనాలపైకి బస్సు | Five Dead After Bus Ploughs Into Moscow Pedestrian | Sakshi
Sakshi News home page

రష్యాలో షాకింగ్ ప్రమాదం.. జనాలపైకి బస్సు

Published Mon, Dec 25 2017 8:40 PM | Last Updated on Mon, Dec 25 2017 8:40 PM

Five Dead After Bus Ploughs Into Moscow Pedestrian - Sakshi

మాస్కో : రష్యాలో షాకింగ్ ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డుపై వెళుతున్న బస్సు కాస్త పాదచారులపైకి దూసుకెళ్లింది. దాంతో ఐదుగురు చనిపోయినట్లు ట్రాఫిక్‌ పోలీసులు చెప్పారు. వారు చెప్పిన ప్రకారం వెస్ట్రన్‌ మాస్కోలో ఈ ప్రమాదం సంభవించింది. అయితే ఈ ప్రమాదానికి కారణాలు మాత్రం ఇంకా తెలియరాలేదని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెప్పారు. సాంకేతిక పరిజ్ఞాన లోపంతోపాటు పలుకారణాలు ఉండొచ్చని తాము అనుమానిస్తున్నట్లు వెల్లడిచించారు.

‘రోడ్డుపై వెళుతున్న బస్సు అనూహ్యంగా అండర్‌ పాస్‌ మెట్ల మీదుగా వెళుతున్న పాదచారులపైకి వెళ్లింది. దాంతో మేం షాకయ్యాం. మాకు అందిన సమాచారం మేరకు ఐదుగురు చనిపోయారు’ అని పోలీసు అధికార ప్రతినిధి ఆర్టీయోం కొలెస్నికోవ్‌ చెప్పారు. సీసీటీవీలో లభించిన వీడియో ప్రకారం తొలుత బస్సు పాదచారుల మార్గంపైకి వచ్చింది. ఆ తర్వాత అండర్‌ పాస్‌ మెట్లమీదకు జారుకుంటూ నడుస్తున్న వారిని ఢీకొట్టుకుంటూ వెళ్లింది. ప్రస్తుతం బస్సు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.





 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement