ఫొటోతోనే కేలరీలు లెక్కించే యాప్ | Google App Allows You To Count calories in Food Pictures | Sakshi
Sakshi News home page

ఫొటోతోనే కేలరీలు లెక్కించే యాప్

Published Mon, Jun 8 2015 3:01 AM | Last Updated on Mon, Aug 20 2018 2:35 PM

ఫొటోతోనే కేలరీలు లెక్కించే యాప్ - Sakshi

ఫొటోతోనే కేలరీలు లెక్కించే యాప్

వాషింగ్టన్: ఫొటోలోని ఆహారపదార్థాలను స్కాన్ చేసి అందులో కేలరీల సంఖ్యను చెప్పే యాప్‌ను గూగుల్ సంస్థ రూపొందించింది. ‘ఐఎం2 కేలరీస్’ అనే పేరుతో రూపొందించిన ఈ యాప్ ఇమేజ్ ప్రాసెసింగ్ టెక్నాలజీతో ఆహారపదార్థాలను గుర్తిస్తుంది. ఒకవేళ ఈ యాప్ ఫుడ్‌ఐటమ్స్‌ను గుర్తించలేకపోతే వినియోగదారులు సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేసుకునే వీలు కల్పించింది. దీంతో ఈ యాప్ మరింత మెరుగుపడే అవకాశముంటుందని సంస్థ పేర్కొంటోంది. ఇటీవలే దీని పేటెంట్ హక్కుల కోసం గూగుల్ దరఖాస్తు చేసుకుంది.

అయితే ఇది అందుబాటులోకి రావడానికి మరింత సమయం పట్టొచ్చని చెబుతున్నారు. ఈ యాప్ విజయవంతమైతే ట్రాఫిక్ విశ్లేషణ, పార్కింగ్ ప్రదేశాలు ఎక్కడున్నాయనే సమాచారాన్ని అందించేలా మార్పులు చేయాలని చూస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement