గూగుల్.. ఈ పదం తెలియని వ్యక్తి లేడంటే అతిశయోక్తి కాదు. చిన్నపాటి స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతివ్యక్తికి ఈ పదం సుపరిచితమే. ఈరోజుల్లో ఏ సమాచారం కావాలన్నా ‘జై గూగుల్ తల్లి’ అనాల్సిందే. ఎటువంటి సమాచారాన్నయినా క్షణాల్లో యూజర్లకు అందించే గూగుల్ సెర్చ్ ఇంజన్ 20వ పుట్టిన రోజు నేడు.
ఈసందర్భంగా గూగుల్ ఆవిర్భావం, 20 ఏళ్ల దాని ప్రస్థానంపై గూగుల్ డూడుల్, ఓ వీడియోను రిలీజ్ చేసింది. సమాచారాన్నంతా ఒకే వేదిక ద్వారా ప్రపంచానికి అందించాలన్న ఆలోచనతో స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీకి చెందిన ఇద్దరు పీహెచ్‌డీ విద్యార్థులు సర్జీ బ్రిన్, లారీ పేజ్‌లు 1998లో గూగుల్ సెర్చ్ ఇంజిన్‌ను ప్రారంభించారు. ప్రస్తుతం 150 భాషల్లో 190 దేశాల్లో గూగుల్ సెర్చ్ ఇంజిన్ సేవలందిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment