
అమెరికా ప్రముఖ అనస్తీయాలజిస్ట్, ‘అప్గార్ స్కోర్’ పరికర సృష్టికర్త డాక్టర్ వర్జీనియా అప్గార్‌కు దిగ్గజ సెర్చ్ ఇంజన్ గూగుల్ ఘనంగా నివాళులు అర్పించింది. గురువారం(జూన్7) అప్గార్ 109వ జయంతిని పురస్కరించుకొని గూగుల్ తన డూడుల్‌తో ఆమెను మరోసారి ప్రపంచానికి గుర్తు చేసింది. ఆమె ప్రాధాన్యతను గుర్తించి ఆమెకు చిహ్నంగా ఓ డాక్టర్, చిన్న బేబీ ఫొటోలతో గూగుల్ అక్షరాలను రూపొందించి, కింద అప్గార్ అనే అక్షరాలను పొందుపరిచింది.
1909 జూన్ 7న అమెరికాలోని న్యూజెర్సిలో వర్జీనియా అప్గార్ జన్మించారు. కొలంబియా యూనివర్సీటీలోని ఫిజీషియన్ అండ్ సర్జరీ విభాగం మొదటి మహిళా ప్రొఫెసర్‌గా పనిచేశారు. పుట్టిన వెంటనే పిల్లలను ‘అప్గార్ స్కోర్’తో పరిశీలిస్తారు. వారు ఆరోగ్యంగా ఉన్నారా లేదా అని వైద్యులు తేల్చుకోవడానికి ఉపకరించే పరిశీలన ఇది. దీని సృష్టికర్తే డాక్టర్ వర్జీనియా అప్గార్.
పుట్టిన వెంటనే పిల్లలు ఊపిరి ఎలా పీల్చుకుంటున్నారు, వారి శరీర ఛాయతో పాటు హృదయ స్పందన ఎలా ఉన్నాయి.. తదితర విషయాలను అప్గార్ స్కోర్ ద్వారా పరిశీలిస్తారన్న విషయం తెలిసిందే. దీని ప్రకారం 2 మార్కుల చొప్పున గ్రేడింగ్ ఇస్తూ 5-10 లోపల చేస్తారు. శిశువుకి 8-10 మార్కులు వస్తే ఆరోగ్యంగా ఉన్నట్లు లెక్క. శిశువు 0-5 మార్కులు వస్తే బిడ్డ పరిస్థితి సీరియస్‌గా ఉన్నట్లు గుర్తిస్తారు. వర్జీనియా కనుగొన్న అప్గార్ సూచీ వల్ల వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులొచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment