జూకర్బర్గ్కు పెద్ద ఝలక్
న్యూఢిల్లీ: ఫేస్ బుక్ భద్రమే కానీ.. దాని వ్యవస్థాపకుడు, సీఈవో మార్క్ జూకర్ బర్గ్కు మాత్రం హ్యాకర్స్ గట్టి ఝలక్ ఇచ్చారు. లక్షల మంది సోషల్ మీడియా ఖాతాలు తన కనుసన్నల్లో నిలపగల ఆయన వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలపై హ్యాకర్స్ దాడి చేశారు. జూకర్ బర్గ్ కు చెందిన ఏ ఒక్క సోషల్ మీడియా ఖాతాను వారు వదిలిపెట్టలేదు. ఇన్ స్టాగ్రం, లింక్డెన్, పింటరెస్ట్, ట్విట్టర్ ఖాతాలను హ్యాకర్స్ను ట్యాంపరింగ్ చేయడమే కాకుండా చెడకొట్టారని ఆయనకు సంబంధించిన అధికారులు తెలిపారు. అయితే, ఆయన ఈమెయిల్ అకౌంట్పై కూడా దాడి చేశారా అనే విషయం తెలియలేదు.
అయితే, పైన పేర్కొన్న ఖాతాలన్నింటికి కూడా జూకర్ తన వ్యక్తిగత ఈమెయిల్ ను లింక్ గా పెట్టుకున్నట్లు సమాచారం. బహుశా దానిపై కూడా హ్యాకర్ల కన్ను పడే ఉంటుందని అంటున్నారు. సౌదీ అరేబియాకు చెందిన ఓ చిన్న యువగ్రూపు ఈ హ్యాకింగ్ కు పాల్పడినట్లు తెలుస్తోంది. జూకర్ బర్గ్ ఆన్ లైన్ వ్యవస్థకు ఎంతటి సెక్యూరిటీ ఉందో పరీక్షించేందుకే వారు ఇలా చేసి ఉంటారని సోషల్ మీడియాలో పలువురు చెప్తున్నారు. హ్యాక్ చేసిన వాళ్లు కొన్ని స్క్రీన్ షాట్లను.. ఆయన వాడిన డాడాడా (డీఏడీఏడీఏ) పాస్ వర్డ్స్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కానీ, కొద్ది సేపటికే అది ట్విట్టర్ ఖాతా నుంచి కనిపించకుండా పోయింది. ఫేస్ బుక్ కూడా ఈ వార్తలని నిజమేనని చెప్పింది. ప్రస్తుతానికి ఆయన ఇన్ స్టాగ్రం ఖాతా తెరుచుకోవడం లేదట.
Ouch. Mark Zuckerberg's social media accounts have been hacked pic.twitter.com/KvVmXOIg5s
— Ben Hall (@Ben_Hall) 5 June 2016