కొత్త ఖండం అవతరించబోతోందా?
ప్రపంచపటంపై మరో కొత్త ఖండం అవతరించబోతోందా?. న్యూజిల్యాండ్‌కు అనుకుని సముద్ర అంతర్భాగం నుంచి కొద్దిగా బయటకు కనిపిస్తున్న భూమే ఇందుకు నిదర్శనం. మనకు ప్రస్తుత ప్రపంచపటంపై కనిపిస్తున్న న్యూజిలాండ్ భూభాగం ఆ కొంచమే కాదు. దక్షిణ పసిఫిక్ మహా సముద్రంలో కలిసిపోయిన న్యూజిలాండ్ భూభాగం చాలానే ఉంది. ఆ భూభాగమే 'జిల్యాండియా'. ఐదు మిలియన్ల స్క్వేర్ మీటర్ల విస్తీర్ణంలో జిల్యాండియా వ్యాపించి ఉంది. ఈ ప్రాంతంలో మిగిలిన ఖండాల్లానే మనిషి నివసించడానికి కావల్సిన అనుకూలతలన్నీ ఉన్నాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
జియోలాజికల్ సొసైటీ ఆఫ్ అమెరికా జర్నల్‌లో ఇందుకు సంబంధించిన వివరాలు ప్రచురితమయ్యాయి. అయితే, 94 శాతం జిల్యాండియా భూభాగం సముద్రంలో ఉంది. జిల్యాండియాను కొత్త ఖండంగా గుర్తించడం వల్ల దాని పుట్టుపూర్వోత్తరాలను కనుగొనేందుకు అవకాశం కలుగుతుందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. సముద్ర గర్భంలో దాగివున్న భూభాగంపై పరిశోధనలు కష్ట సాధ్యమైనవని, సముద్ర అంతర్భాగం నుంచి జిల్యాండియా బయటపడితే అక్కడ ఎంత విశాలమైన ప్రకృతి దాగివుందో అందరికీ అర్ధమౌతుందని ఓ శాస్త్రవేత్త అన్నారు.