బంగ్లాదేశ్‌లో మరో హిందూ పూజారి హత్య | Hindu priest hacked to death in Bangladesh | Sakshi
Sakshi News home page

బంగ్లాదేశ్‌లో మరో హిందూ పూజారి హత్య

Published Fri, Jul 1 2016 9:58 PM | Last Updated on Mon, Jul 30 2018 8:29 PM

బంగ్లాదేశ్‌లో మరో హిందూ పూజారి హత్య - Sakshi

బంగ్లాదేశ్‌లో మరో హిందూ పూజారి హత్య

ఢాకా: బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు ఆగడం లేదు. తాజాగా ఓ హిందూ పూజారిని అత్యంత కిరాతకంగా నరికిచంపారు. జెనిదాహ్ జిల్లాలో గల రాధామోదొన్ గోపాల మోత్ ఆవరణలోని గార్డెన్‌లో శ్యామనొందొదాస్ (50) అనే పూజారి శుక్రవారం ఉదయం పూజ కోసం పూలు కోస్తుండగా మోటార్‌సైకిల్‌పై వచ్చిన ముగ్గురు దుండగులు ఆయన్ను కత్తులతో పొడిచి చంపారు.

అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. ఈ దాడిలో దాస్ అక్కడికక్కడే మరణించినట్టు పోలీసులు తెలిపారు. ఈ ఏడాది బంగ్లాదేశ్‌లో హత్యకు గురైన పూజారుల్లో దాస్ మూడోవారు. గత ఫిబ్రవరిలో పంచగఢ్ జిల్లాలో 50 ఏళ్ల హిందూ పూజారి  హత్యకు గురవగా.. జూన్ 7న జెనిదాహ్ జిల్లాలోనే 65 ఏళ్ల పూజారిని దుండగులు దారుణంగా నరికిచంపారు. బంగ్లాదేశ్‌లో మైనారిటీలైన హిందువులతోపాటు క్రిస్టియన్లపైన ఇస్లామిస్ట్ తీవ్రవాదుల దాడులు పెరిగిపోవడం తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement