ఫ్రాన్స్ తో భారత్ యుద్ధ విమానాల ఒప్పందం
న్యూఢిల్లీ: రాఫెల్ ఫైటర్ జెట్ యుద్ధ విమానాల కొనుగోలు పట్ల భారత్, ఫ్రాన్స్ లు ఒప్పందాన్ని కుదుర్చుకోనున్నాయి. ఫ్రాన్స్ నుంచి 36 జెట్ లను భారత్ కొనుగోలు చేయనుంది. ఇందుకు సంబంధించి రేపు ఫ్రాన్స్ రక్షణ మంత్రి భారత్ లో పర్యటించనున్న నేపథ్యంలో కీలక ఒప్పందంపై ఇరు దేశాలు సంతకాలు చేయనున్నాయి.
36 జెట్ విమానాలకు 12 బిలియన్ యూరోలు చెల్లించాలని ఫ్రాన్స్ డిమాండ్ చేసింది. కానీ భారత్ వాటి ధరను తగ్గించి 8 బిలియన్ యూరోలుకే ఒప్పందాన్ని కుదుర్చుకుంది. పాత కాలం నాటి యుద్ధ విమానాలను మార్చాలని భారత్ ఎప్పటి నుంచే భావిస్తోంది. ఇందులో భాగంగా భారీ స్థాయిలో రాఫెల్ విమానాలను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. మొదటి విడతలో భాగంగా 36 విమానాలు కొనుగోలు చేయనుంది.