న్యూఢిలీ : చిన్నా పెద్దా తేడాలేకుండా ‘ఫ్రెండ్‌షిప్ డే’ రోజున స్నేహితులందరూ ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకుంటారు. ఇక గత 25 ఏళ్లుగా ఇజ్రాయెల్, భారత్ మధ్య కొనసాగుతున్న మెరుగైన ద్వైపాక్షిక సంబంధాలకు తోడు ఇరుదేశాల ప్రధానులు బెంజమిన్ నెతన్యాహు, నరేంద్ర మోదీ మధ్య స్నేహబంధం కూడా ఉంది. అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం సందర్భంగా నెతన్యాహు ప్రధాని మోదీకి ‘స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు’ తెలిపారు.
(చదవండి : ఇజ్రాయెల్ ఎన్నికల్లో ‘మోదీ’ ప్రచారం)
ఈ మేరకు ఆయన 1975లో వచ్చిన బాలీవుడ్ ఎవర్‌గ్రీన్ సూపర్‌హిట్ ‘షోలే’ చిత్రంలోని ‘యే దోస్తీ హమ్ నహీ తోడేంగే’ పాటను కోట్ చేస్తూ ట్వీట్ చేశారు. ‘మన స్నేహం మరింత బలపడాలి. ఉన్నత శిఖరాలకు చేరాలి’ అని ఆకాక్షించారు. 2017లో మోదీ పర్యటన సందర్భంగా దిగిన ఫొటోలను షేర్ చేశారు. ఇజ్రాయెల్ ప్రధాని ట్వీట్‌పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇదిలాఉండగా.. ఇజ్రాయెల్ పార్లమెంటుకు సెప్టెంబర్‌లో ఎన్నికలు జరుగనున్నాయి. అయితే, ఎన్నికలకు 8 రోజుల ముందు నెతన్యాహు భారత్‌లో పర్యటించనున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మోదీ-నెతన్యాహు చేతులు కలిపిన ఫొటోను ఇజ్రాయెల్‌లోని టెల్ అవివ్‌లో ప్రదర్శించడం విశేషం.
Happy #FriendshipDay2019 India!
— Israel in India (@IsraelinIndia) August 4, 2019
May our ever strengthening friendship & #growingpartnership touch greater heights.
🔊🎧🎶 ये दोस्ती हम नहीं तोड़ेंगे..... 🇮🇱❤🇮🇳 pic.twitter.com/BQDv8QnFVj
Comments
Please login to add a commentAdd a comment