సియోల్: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందంటూ వచ్చిన వార్తలు ఉట్టి పుకార్లేనని తేలిపోయాయి. ఆయన ఆరోగ్యానికి ఎలాంటి ఢోకా లేదంటూ కిమ్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఉత్తర కొరియా మీడియా విడుదల చేసింది. ఇందులో మూడు వారాలపాటు అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన కిమ్ సంచోన్‌లో ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభోత్సవంలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. పైగా ఈ కార్యక్రమంలో తన సోదరి అందించిన కత్తెరతో రిబ్బన్ కటింగ్ చేశారు. నల్లని మావో సూట్ వేసుకుని, మార్చిన హెయిర్‌స్టైల్‌తో నవ్వులు చిందిస్తూ కనిపించారు. (కిమ్ బతికే ఉన్నాడు!)
అయితే ఈ ఫొటోలను సునిశితంగా పరిశీలిస్తే.. కిమ్ కుడి చేతిపై ఏదో మార్క్ ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. అయితే ఇది హృదయనాళ(కార్డియో వాస్క్యులర్ ప్రొసీజర్)కు సంబంధించి అయి ఉండొచ్చని, బహుశా రేడియల్ ఆర్టరీ పంక్చరీ అయి ఉండొచ్చని అమెరికాకు చెందిన ఓ వైద్యుడు తెలిపారు. మరోవైపు కిమ్ హార్ట్ సర్జరీ చేసుకున్నాడేమోనని కొందరు అభిప్రాయపడుతున్నారు. అందుకోసమే ఇన్నివారాలు ప్రపంచం ముందుకు రాలేకపోయి ఉండవచ్చని పేర్కొంటున్నారు. (20 రోజుల తర్వాత కనిపించిన కిమ్)
చదవండి: కిమ్ అసలైన ‘వారసుడు’ అతడే!
Comments
Please login to add a commentAdd a comment