ట్రంప్‌ను తొలగించారని తెలిసి.. | Man died peacefully after falsely told Trump was impeached | Sakshi
Sakshi News home page

ట్రంప్‌ను తొలగించారని తెలిసి..

Published Wed, Apr 19 2017 6:34 AM | Last Updated on Thu, Apr 4 2019 5:04 PM

ట్రంప్‌ను తొలగించారని తెలిసి.. - Sakshi

ట్రంప్‌ను తొలగించారని తెలిసి..

న్యూయార్క్‌: అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను పదవీచ్యుతుడిని చేశారని తన మాజీ భార్య చెప్పిన మాట విని ఓ వృద్ధుడు ప్రశాంతంగా కన్నుమూసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అమెరికాకు చెందిన మైఖేల్‌ గార్‌లాండ్‌ ఇలియట్‌(75)కు రాజకీయాలపై ఆసక్తి. ట్రంప్‌ విధానాలను వ్యతిరేకించే ఆయన కొద్దికాలంగా హృద్రోగంతో బాధపడుతున్నారు.

మంచానికి పరిమితమై కొన ఊపిరితో ఉన్న ఇలియట్‌కు ట్రంప్‌ను పదవి నుంచి తొలగించారన్న వార్తను ఆయన మాజీ భార్య థెరీసా(68) ఫోన్‌లో చెప్పగానే ఏప్రిల్‌ 6న ప్రశాంతంగా కన్నుమూసినట్లు స్థానిక మీడియా తెలిపింది. ఇరవై ఏళ్ల క్రితమే ఇలియట్‌తో విడిపోయిన థెరిసా మాట్లాడుతూ, ఇలియట్‌ చివరి ఘడియల్లో ఉన్నాడని తనకు తెలుసనీ, అందుకే అలా చెప్పాల్సి వచ్చింది అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement