
సాక్షి, హైదరాబాద్: మీ దగ్గర ఐఫోన్ లేదా ? లేకపోతే పెద్దగా వచ్చే నష్టమేమీ లేదేమో ! కానీ నా దగ్గర లేకపోతే ఒప్పుకునే సమస్యే లేదంటున్నాడు రష్యాలోని మాస్కోకి చెందిన ఓ యువకుడు. ఐఫోన్ కోసం కిడ్నీ అమ్ముకున్న వారి నుంచి రకరకాల పిచ్చి పనులను చేసిన వారిని చూశాము. అయితే తాజాగా వచ్చిన ఆపిల్ ఎక్స్‌ఎస్‌ని సొంతం చేసుకోవడానికి ఈ వ్యక్తి చేసిన పనిని చూస్తే నవ్వాగదు.
ఈ ఐఫోన్‌ను కొనడానికి అతడు లక్ష రష్యన్ రూబెల్స్‌ను (రూ. 1,08,000) నాణేల రూపంలో సేకరించాడు. అలా సేకరించిన కాయిన్స్ అన్నింటినీ బాత్‌టబ్‌లో కుమ్మరించాడు. దీంతో ఆ బాత్‌టబ్ బరువు 350 కేజీలకు చేరింది. స్నేహితుల సాయంలో దాన్ని కారులో పెట్టించి ఆపిల్ ఉత్పత్తులను అమ్మే ప్రముఖ షాపింగ్ మాల్‌కు తీసుకెళ్లాడు.
సాధారణంగా షాప్ నిర్వాహకులు ఇలాంటి విచిత్ర నగదు చెల్లింపును స్వీకరించరు. కానీ ఈ దుకాణాదారునికి బాగా సమయం, ఓపిక ఉన్నట్లుంది. ఆ కాయిన్స్ అన్నింటినీ లెక్కించి ఐఫోన్ ఎక్స్‌ఎస్ 256 జీబీ మోడల్‌ను అందించాడు.
ఐపోన్ యూజర్లందు ఈ యూజరు వేరయా..! అంటూ నెటిజన్లు షేర్ల మీద షేర్లు కొడుతున్నారు. ఆ వీడియోపై మీరు ఓ లుక్కేయండి..
Comments
Please login to add a commentAdd a comment