కారు ఢీకొట్టడంతో.. ఎగిరిపడినా..!
లండన్: హిట్ అండ్ రన్ కేసులో ఓ వ్యక్తి ప్రాణాపాయం నుంచి తప్పించుకుని మృత్యుంజయుడిగా బయటపడ్డాడు. వేగంగా వెళ్తున్న కారు 53 ఏళ్ల వ్యక్తిని ఢీకొట్టి, ఆపకుండా వెళ్లిపోయింది. కారు ఢీకొట్టగానే బాధితుడు కారుపై ఎగిరిపడి వెనకాల రోడ్డుపై పడ్డాడు. ఈ నెల 14న ఇంగ్లండ్లోని బ్రిగ్టన్లో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగినప్పుడు నమోదైన సీసీటీవీ ఫుటేజీ దృశ్యాలను పోలీసులు విడుదల చేశారు.
కెంప్టౌన్ ప్రాంతంలో బాధితుడు రోడ్డు దాటుతుండగా ఈ ప్రమాదం జరిగింది. బాధితుడి తలకు తీవ్రంగా గాయలయ్యాయి. బాధితుడు కోలుకుంటున్నాడని, ప్రమాదం లేదని పోలీసులు చెప్పారు. కేసు నమోదు చేసుకుని నిందితుడి కోసం గాలిస్తున్నారు. అలాగే ప్రత్యక్ష సాక్షుల నుంచి వివరాలు సేకరించేందుకు ప్రయత్నిస్తున్నారు.