బీజింగ్: కరోనా తెచ్చిన తంటాలు అన్నీ ఇన్నీ కావు. బయట అడుగు పెట్టాలంటే మాస్కు, గ్లౌజు వంటి ఆయుధాలు ధరించాల్సిందే. ఇక దూర ప్రయాణాలు చేయాలంటే ఫోన్‌లో ఆరోగ్య సేతు తప్పనిసరి. చైనాలోనూ ఇలాంటి యాప్ ఉంది. ఇందులో ఫోన్ వాడే వ్యక్తి ఆరోగ్య వివరాలు రిజిస్టర్ అయి ఉంటాయి. అంతేకాక దగ్గర్లోని కరోనా పేషెంట్ల వివరాలను తెలియజేస్తూ హెచ్చరికలు జారీ చేస్తుంది. హోటల్‌లో, ప్రజా రవాణా వాహనాల్లో, ఆఖరికి సూపర్ మార్కెట్లలోనూ ఈ యాప్‌లో మీ వివరాలు చూపించిన తర్వాతే లోనికి అనుమతి ఇస్తారు. అయితే అసలు ఫోన్ అందుబాటులో లేని ఓ చైనీయుడు అష్టకష్టాలు పడాల్సి వచ్చింది. చైనాలో గీ అనే వ్యక్తి తన సొంతూరికి వెళ్దామనుకున్నాడు. (చైనాతో యుద్ధానికి నేను సైతం.. రాష్ట్రపతికి రక్తంతో..)
దీనికోసం ప్రజారవాణాను ఆశ్రయించగా అతడిని అనుమానంగా చూశారు. కరోనా లేదన్న నమ్మకం ఏంటి? అంటూ అందుకు సాక్ష్యం చూపించమని అడిగారు. అందుకు అతను బిక్కమొహం వేశాడు. ఫోన్ యాప్ ద్వారా కరోనా లేదని నిరూపించవచ్చు. కానీ అసలు సదరు వ్యక్తి దగ్గర ఫోన్ కూడా అందుబాటులో లేదు. దీంతో అతడు తాను ఆరోగ్యంగానే ఉన్నానంటూ ఎంత చెప్పినా వినిపించుకోకుండా, వాహనాల్లో ఎక్కించుకోడానికి నిరాకరించారు. గత్యంతరం లేని పరిస్థితిలో అతడు తన కాళ్లను నమ్ముకున్నాడు. 600 మైళ్లు అంటే 965 కి.మీ నడిచి స్వస్థలానికి చేరుకున్నాడు. అన్హుయ్ ప్రావిన్స్ నుంచి ఝిజియాంగ్ చేరడానికి అతడికి 15 రోజులు పట్టింది. ఈ ప్రయాణంలో రాత్రిళ్లు పార్కుల్లో విశ్రాంతి తీసుకున్నట్లు ఆయన తెలిపాడు. (తెరపైకి మరో ఘర్షణ వీడియో)
Comments
Please login to add a commentAdd a comment