
మండేలా నా సొంత హీరో: ఒబామా
వాషింగ్టంన్: జాతి వివ క్ష వ్యతిరేక పోరాట యోధుడు, దక్షిణాఫ్రికా దివంగతనేత నె ల్సన్ మండేలా తనకు వ్యక్తిగత హీరో అని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా కొనియాడారు. నెల్సన్ మండేలా, ఈ భూమిపై జన్మించిన అత్యంత ప్రభావశీలి, సాహసి అయిన విశిష్టవ్యక్తి అని, న్యాయం, సమానత్వంకోసం కృషిచేసిన పోరాటయోధుడని అని ఒబామా ప్రశంసించారు.
తనకేకాక, మరెంతో మందికి వ్యక్తిగత హీరోగా మండేలా నిలిచారన్నారు. మండేలా జయంతి సందర్భంగా శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా జరిగిన మండేలా అంతర్జాతీయ దినోత్సవంలో ఒబామా పాల్గొన్నారు. మండేలా గత ఏడాది కన్నుమూసిన తర్వాత తొలిసారిగా ఆయన జయంతిని జరుపుకుంటున్నామని, మన జీవితాలపై ఆయన వేసిన ముద్ర మనకెంతో స్ఫూర్తిదాయకంగా ఉంటుందని ఒబామా అన్నారు.