లండన్: గ్రహాంతరవాసుల ఉనికిని తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు సమీప నక్షత్రంపైకి ఓ సందేశాన్ని పంపారు. భూమికి 12 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న జీజే 273 నక్షత్రానికి రేడియో సందేశాలను పంపినట్లు మెసేజింగ్ ఎక్స్‌ట్రాటెరెస్ట్రియల్ ఇంటెలిజెన్స్ ఇంటర్నేషనల్(ఎంఈటీఐ) సోమవారం తెలిపింది. జీజే 273 నక్షత్రం రెండు గ్రహాలను కలిగి ఉందని, అందులో ఒకదానికి జీజే 237బీ అని నామకరణం చేశారు. ఇది జీవుల ఆవాసానికి అనుకూల వాతావరణమున్న గ్రహం కావడంతో దీనిపై గ్రహాంతరవాసులు ఉండే అవకాశముందని భావిస్తున్నారు.
నీటిజాడ ఉండడంతో జీవరాశి ఉండే అవకాశముందని చెబుతున్నారు. తాము భావిస్తున్నట్లు జీజే 237పై జీవరాశి ఉన్నట్లయితే రేడియో సందేశాల ద్వారా తెలుసుకోవచ్చని, అయితే ఆ జీవరాశి ఏలియన్లా? కాదా? అనేది తెలుసుకునేందుకు మరిన్ని ప్రయోగాలు చేయాల్సి ఉంటుందని ఎంఈటీఐ శాస్త్రవేత్తలు అంటున్నారు. ‘మేం పంపిన సందేశాల ద్వారా ఏలియన్ల గురించి తెలుసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే అవి ఏలియన్లు కాకుండా ఇతర జీవరాశి అయినా మా కష్టం ఫలించినట్లే’నని ఎంఈటీఐ శాస్త్రవేత్త డగ్లస్ వాకోచ్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment