లండన్ : దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నప్పటికీ ప్రపంచ దేశాలతో పోలిస్తే మరణాల సంఖ్య తక్కువగానే ఉంది. ఇప్పటి వరకే దేశంలో కోవిడ్ కారణంగా 872మంది మరణించారు. అయితే వైరస్ సోకి మృతిచెందిన భారతీయుల సంఖ్య భారత్‌లో కన్నా బ్రిటన్‌లో ఎక్కువగా ఉన్నట్లు అక్కడి ప్రభుత్వ వర్గాల ద్వారా తెలుస్తోంది. బ్రిటన్‌లో సోమవారం నాటికి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,59,569కి చేరుకోగా.. 23,319 మంది మృతిచెందారు. వీరిలో బ్రిటన్ పౌరుల కన్నా వివిధ దేశాల నుంచి వలసలకు వచ్చినవారే ఎక్కువగా ఉండటం గమనార్హం. వైరస్ కారణంగా బ్రిటన్‌లో వెయ్యికిపైగా భారత్ నుంచి వలసవెళ్లిన వాళ్లు మరణించి ఉంటారని అక్కడి అధికారుల ద్వారా తెలుస్తోంది. (లాక్‌డౌన్ కొనసాగింపునకే మోదీ మొగ్గు..!)
కానీ అక్కడి భారతీయుల మరణాలపై స్థానిక ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. మరోవైపు వైరస్ నుంచి కోలుకున్న వారి సంఖ్య చాలా తక్కువగా ఉంది. కరోనా కట్టడికి దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించినప్పటికీ వైరస్‌ను మాత్రం అదుపుచేయలేకపోయింది. ఏకంగా ఆదేశ ప్రధాని బోరిస్ జాన్సన్ క్వారెంటైన్‌కు వెళ్లాల్సి వచ్చిందంటే అక్కడి పరిస్థితి ఏవిధంగా అర్థమవుతోంది. దేశంలో నమోదైన కరోనా బాధితుల్లో 40శాతం మంది మైనార్టీల జానాభాకు చెందిన వారేనని బ్రిటన్ ప్రభుత్వం ప్రకటించింది. అంతేకాక 40శాతం ఐసీయూల్లోనూ వారే ఉన్నారని తెలిపింది. (కరోనా కట్టడికి నాలుగంచెల వ్యూహం..!)
Comments
Please login to add a commentAdd a comment