ఇస్లామాబాద్: కశ్మీర్‌లోని ‘స్వాతంత్య్ర సమరయోధుల’(కశ్మీర్ వేర్పాటువాదులు)కు తమ ప్రభుత్వం మద్దతుగా నిలబడిందనీ, వారికి అవసరమైన సహాయం చేసిందని పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు జనరల్ పర్వేజ్ ముషార్రఫ్ సోమవారం చెప్పారు.
కేవలం వారితోనే పని అవ్వదనీ, కశ్మీర్ సమస్య పరిష్కారంపై భారత్‌తో చర్చలకు రాజకీయ విధానం అవసరమని అనంతరం గుర్తించినట్లు తెలిపారు. భారత్ చర్చించడానికి కూడా ఇష్టపడని విషయాలపై రాజీ కుదుర్చుకునేందుకు తాము భారత్‌ను చర్చల వరకు తీసుకొచ్చామని ఆయన ఒక ఇంటర్వ్యూ లో చెప్టపుకొచ్చారు. ప్రస్తుతం ముషార్రఫ్ దుబాయ్‌లో ఉంటున్నారు.