న్యూయార్క్ : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 9/11 మృతులకు నివాళులు అర్పించారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన శనివారం గ్రౌండ్ జీరోను సందర్శించి మృతులకు అంజలి ఘటించారు. స్మారక స్థూపాల వద్ద మోడీ పుష్పగుచ్చాలు ఉంచి నమస్కరించారు. అనంతరం ఆయన 9/11 మ్యూజియంను సందర్శించారు. అల్ ఖైదా మిలిటెంట్లు 2001 సెప్టెంబర్ 11న వరల్డ్ ట్రేడ్ సెంటర్ పై జరిగిన దాడిలో దాదాపు మూడువేల మంది మరణించిన సంగతి తెలిసిందే. అమెరికా యంత్రాంగం ఈ దాడి జరిగిన ప్రదేశాన్ని గ్రౌండ్ జీరో పేరుతో మృతుల స్మారక ప్రదేశంగా మార్చింది.
9/11 మృతులకు మోడీ నివాళులు
Published Sat, Sep 27 2014 7:25 PM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM
Advertisement
Advertisement