
నవాజ్ షరీఫ్ ఆస్తులు సీజ్?!
అవినీతి ఆరోపణలతో పాకిస్తాన్ ప్రధాని పదవికి రాజీనామా చేసిన నవాజ్ షరీఫ్ మరిన్ని సమస్యలు ఎదుర్కోనున్నారు.
సాక్షి, ఇస్లామాబాద్ : అవినీతి ఆరోపణలతో పాకిస్తాన్ ప్రధాని పదవికి రాజీనామా చేసిన నవాజ్ షరీఫ్ మరిన్ని సమస్యలు ఎదుర్కోనున్నారు. తాజాగా షరీఫ్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యుల ఆస్తులను కూడా సీజ్ చేయాలని పాకిస్తాన్ నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో.. ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ప్రధానంగా షరీఫ్ కుటుంబీకులు హసన్, హుస్సేన్, మర్యమ్ నవాజ్‌ల ఆస్తులను తక్షణం సీజ్ చేయాలని ఎన్‌ఏబీ డిమాండ్ చేసింది. ఆదాయానికి మంచి ఆస్తులు సంపాదించిన ఆర్థిక మంత్రి ఇషక్ దార్ ఆస్తులను సీజ్ చేసి.. ఆయన అవినీతిపై దర్యాప్తు చేయాలని ఎన్‌ఏబీ ప్రభుత్వాన్ని కోరింది.