
కొండచరియల రూపంలో పొంచి ఉన్న ముప్పు!
వాషింగ్టన్: నేపాల్కు కొండచరియల రూపంలో ముప్పు పొంచి ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. ఈ నెల 25, 26 తేదీలలో నేపాల్లో అనేకసార్లు భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. ఈ కారణంగా ప్రాణ, ఆస్తి నష్టం భారీగా జరిగింది.
శక్తివంతమైన ఈ భూకంపం ధాటికి పర్వతాలన్నీ కదిలిపోయాయి. వచ్చే వర్షాకాలంలో పెద్ద ఎత్తున కొండచరియలు విరిగిపడతాయని శాస్త్రవేత్తలు హెచ్చరించారు.