
బేఖాతర్.. 50టన్నుల అణుపరీక్షకు రెడీ
ప్యాంగ్‌యాంగ్: జగడాల మారి ఉత్తర కొరియా అదే దూకుడును కొనసాగిస్తోంది. తన అణ్వస్త్రాల ప్రయోగాలను అదే వేగంగా ముందుకు తీసుకెళుతోంది. తాజాగా మరో ఖండాంతర అణుక్షిపణిని (ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్-ఐసీబీఎం) పరీక్షించేందుకు ఏర్పాట్లలో నిమగ్నమైంది.
ఓ పక్క ఇప్పటికే హైడ్రోజన్ బాంబును పరీక్షించడం కారణంగా అంతర్జాతీయ సమాజం ఆగ్రహం వ్యక్తం చేస్తుండగానే వాటిని బేఖాతరు చేస్తూ తాజాగా మరో పరీక్షకు సిద్ధమవుతోంది. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ మరో పరీక్షకు సిద్ధమవుతున్నట్లు తమకు సమాచారం ఉందని దక్షిణ కొరియా సైనిక వర్గాలు తెలిపాయి. దాదాపు 50 టన్నుల పేలుడు పదార్థాన్ని ఆ ఖండాంతర అణుక్షిపణిలో వాడనున్నట్లు తమకు సమాచారం ఉందన్నారు. ఇప్పటికే ఉత్తర కొరియా ఆరు సార్లు అణుపరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే.