
పాకిస్తాన్.. ఉగ్రవాదుల అడ్డా
- సమితి సమావేశాల్లో పాక్‌కు షాక్
- పాకిస్తాన్‌ను ఉగ్రవాదుల అడ్డాగా పేర్కొన్న ఆఫ్ఘనిస్తాన్
ఐక్యరాజ్యసమితి : ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సమావేశాల్లో పాకిస్తాన్‌కు గురువారం గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఉగ్రస్థావరాలకు పాకిస్తాన్ అడ్డాగా మారిందరి ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ ప్రతినిధి ఒకరు సమితి సమావేశాల్లో వ్యాఖ్యానించారు. ఉగ్రవాదులను నిరోధించడం, వారి కార్యకలాపాలను అడ్డుకోవడంలో పాకిస్తాన్ పూర్తిగా విఫలమైందని అన్నారు. తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడంలో భాగంగా పాకిస్తాన్.. అంతర్జాతీయ సమాజాన్నితప్పుదోవ పట్టిస్తోందని ఆయన ఘాటుగా చెప్పారు.
పాకిస్తాన్ ప్రధాని షాహిద్ ఖాన్ అబ్బాసీ బుధవారం సమితిలో ప్రసంగిస్తూ.. తాలిబన్ వంటి ఉగ్రశక్తులు పాకిస్తాన్‌లో లేవు.. ఉగ్రమూకలకు ఆఫ్ఘనిస్తాన్ భూతల స్వర్గమని వ్యాఖ్యలు చేశారు. పాక్ చేసిన వ్యాఖ్యలను ఆఫ్ఘనిస్తాన్ తీవ్రంగా తప్పు పట్టింది. ఆఫ్ఘనిస్తాన్‌లో ఉగ్రకార్యకలాపలకు సంబంధించిన ఆధారాలు, రుజువులు ఉంచే చూపాలని ఆయన అన్నారు. ఉగ్రవాద స్థావరాలు పాక్‌లోనే ఉన్నాయని.. తాము పెంచి పోషించ ఉగ్రమూకలతోనే ఆ దేశం నేడు తీవ్ర అభద్రతా భావంలోకి వెళ్లిందని చెప్పారు.
తమ దేశంలోని ఉగ్రస్థావరాలను ఇప్పటికే పూర్తిగా ఏరివేశామని ఆయన అంతర్జాతీయ ప్రపంచానికి ప్రకటించారు. ఇరుదేశాల మధ్యనున్న వివాదాలను పరిష్కరించుకునేందుకు ఆఫ్ఘన్ ఎప్పుడూ సిద్ధమేనని చెప్పారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నామని మాటలు కాకుండా.. చేతుల్లో చూపాలని హితవు పలికారు. మేం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాం.. అందులో భాగంగా మా సైనికులు ప్రతిరోజూ దేశంలోనూ, సరిహద్దుల వెంబడి ఎన్నో త్యాగాలు చేస్తున్నారని ఆఫ్ఘన్ దౌత్యాధికారి చెప్పారు.