
తొమ్మిది కిలోల నుంచి ఆరున్నర కిలోలకు బ్యాగేజ్. మీరు మాత్రం నాలాగా చేయకండి.
విమాన ప్రయాణాల్లో ఎక్స్‌ట్రా లగేజ్‌కు ఫీజు చెల్లించకుండా తప్పించుకునేందుకు ఓ యవతి వేసిన పథకం నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోంది. మీరు స్మార్ట్ మేడమ్...ఇలా చేయాలని తెలియక ఎన్నోసార్లు అనవసరంగా ఫీజు కట్టాశామే అంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు. ఇంతకీ విషయమేమిటంటే... ఫిలిప్పైన్స్‌కు చెందిన జెల్ రోడ్రిగెజ్ అక్టోబరు 2న విమానం ఎక్కేందుకు స్థానిక ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఈ క్రమంలో కేవలం 7 కిలోల వరకు లగేజ్ ఫ్రీగా క్యారీ చేసే అవకాశం ఉందని.. తన దగ్గర ఉన్న మిగతా రెండు కేజీలకు ఫీజు చెల్లించాలని సంబంధిత అధికారులు ఆమెకు చెప్పారు. అయితే రోడ్రిగెజ్‌కు మాత్రం డబ్బు చెల్లించడం ససేమిరా ఇష్టం లేదు. సరిగ్గా అప్పుడే తనకు ఓ ఉపాయం తట్టింది. తక్షణమే ఆలస్యం చేయకుండా తన సూట్‌కేస్‌లో ఉన్న రెండున్నర కిలోల దుస్తులు(షర్టులు, ప్యాంట్లు) ధరించడం మొదలుపెట్టారు. దీంతో తన లగేజీ భారం ఆరున్నర కిలోలకు తగ్గింది.
ఈ విషయాన్ని ఫేస్‌బుక్ యూజర్లతో పంచుకున్న రోడ్రిగెజ్... ‘ తొమ్మిది కిలోల నుంచి ఆరున్నర కిలోలకు బ్యాగేజ్ #ExcessBaggageChallengeAccepted’ అని తన పేజీలో రాసుకొచ్చారు. ‘నన్ను చూసి చాలా మంది ఈ ఐడియా ఫాలో అవుతారేమో. అయితే మరీ చిన్నపాటి లగేజ్‌కు అమౌంట్ చెల్లించడం ఇష్టం లేకే ఇలా చేశాను. మీరు మాత్రం నాలా చేయకండి’ అంటూ తన ఫొటోను షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. ఈ క్రమంలో.. ‘భలే ఐడియా. మీరు వద్దని చెప్పినప్పటికీ సమయం వచ్చినపుడు మీ ప్లాన్ వర్కవుట్ చేయక తప్పదు’ అంటూ నెటిజన్లు సరదాగా కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈ ఏడాది జూలైలో స్కాట్లాండ్‌కు చెందిన ఓ వ్యక్తి ఎక్స్‌ట్రా లగేజ్ భారాన్ని తప్పించుకునేందుకు ఏకంగా 15 షర్టులు ధరించిన సంగతి తెలిసిందే.