విమానం @ 2030
800 మంది ప్రయాణించే సౌలభ్యం, మూడంతస్తుల్లో సకల సదుపాయాలతో గదులు, పడకలు, సిబ్బంది కార్యాలయాలు. ఇవన్నీ 2030లో రాబోయే సరికొత్త విమానం హంగులు. బార్సిలోనాకు చెందిన ఆస్కార్ వినాల్స్ అనే డిజైనర్ ఈగల్ కాన్సెప్ట్ అనే డిజైన్ రూపొందించారు. విమానం మొత్తానికి సరిపోయే విద్యుత్‌ను రెక్కలకున్న సౌరఫలకాలతో ఉత్పత్తి చేసుకుంటుందట. 96 మీటర్ల రెక్కలుండటంతో ల్యాండింగ్ సులువుగా చేయొచ్చట. 525 మందిని తీసుకెళ్లగల సామర్థ్యంతో ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద విమానం ఎయిర్‌బస్ ఏ380తో పోలిస్తే కొత్త విమానం నమూనా (ఇన్‌సెట్)లో.