ప్లాస్టిక్ బాల్స్తో వాటర్ సేవింగ్ | plastic balls threwn in to Reservoirs to save water in usa | Sakshi
Sakshi News home page

ప్లాస్టిక్ బాల్స్తో వాటర్ సేవింగ్

Published Wed, Aug 12 2015 4:48 PM | Last Updated on Tue, Sep 18 2018 6:38 PM

ప్లాస్టిక్ బాల్స్తో వాటర్ సేవింగ్ - Sakshi

ప్లాస్టిక్ బాల్స్తో వాటర్ సేవింగ్

లాస్ ఏంజెలిస్: ఈసారి కరవు కాటకాలతో అల్లాడిపోతున్న అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో మంచినీటి వనరులను రక్షించుకునేందుకు వినూత్న ప్రక్రియను చేపట్టారు. 75 ఎకరాల్లో విస్తరించివున్న లాస్ ఏంజెలిస్ మంచినీటి రిజర్వాయర్లో తీవ్రమైన ఎండల కారణంగా నీరు ఆవిరైపోకుండా ఉండేందుకు ప్లాస్టిక్ బాల్స్‌ను  వాటిల్లోకి వదిలారు. పెద్ద పరిమాణంలోని ఆపిల్ అంతా ఉండే ప్లాస్టిక్ బాల్స్‌ను దాదాపు పదికోట్లు వదిలినట్లు లాస్ ఏంజెలిస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ వాటర్ అండ్ పవర్ అధికారులు తెలిపారు.

ఎండకు నీరు ఆవిరికాకుండా ఉండడంతోపాటు రసాయనిక చర్యలవల్ల నీరు కలుషితం కాకుండా ఉంటుందని, నల్ల రంగు బాల్స్‌ను వాడడంవల్ల సూర్యుడి అల్ట్రా వాయిలెట్ కిరణాలు కూడా నీటిపై ప్రభావం చూపవని అధికారులు వివరించారు. అంతేకాకుండా పక్షులు, ఇతర జంతువులు కూడా రిజర్వాయర్‌లోకి ప్రవేశించకుండా ఈ ప్లాస్టిక్ బాల్స్ అడ్డుకుంటాయని వారు చెప్పారు.

తాము తీసుకున్న ఈ చర్య వల్ల ఏడాదికి 30 కోట్ల గ్యాలన్ల నీటిని పరిరక్షించుకోవచ్చని, ఈ నీటితో 8100 మంది ప్రజలకు ఏడాదిపాటు మంచినీటిని సరఫరా చేయొచ్చని వివరించారు. పైగా ఈ తరహా విధానం ద్వారా తమకు ఏడాదికి రూ.2,500 కోట్లు కలిసొస్తాయని చెబుతున్నారు. కానీ, పర్యావరణ సమతౌల్యం మాత్రం వారు విస్మరిస్తున్నారు. పశు పక్షాదుల దాహార్తిని తీర్చే తరుణోపాయం గురించి కూడా ఆలోచించడం లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement