వాషింగ్టన్: సైన్స్, ఇంజనీరింగ్ రంగాల్లో అత్యున్నత పురస్కారమైన అమెరికా ప్రెసిడెన్షియల్ అవార్డులకు దేశాధ్యక్షుడు బరాక్ ఒబామా నలుగురు భారతీయ అమెరికన్లను సహా 102 శాస్త్రవేత్తలను. పరిశోధకులను ఎంపిక చేశారు. ప్రెసిడెన్షియల్ ఎర్లీ కెరీర్ అవార్డ్స్ ఫర్ సైంటిస్ట్స్ అండ్ ఇంజనీర్స్(పీఈసీఏఎస్‌ఈ)కు ఎంపికైన భారతీయ అమెరికన్లలో పంకజ్ లాల్(మోంట్‌క్లెయిర్ స్టేట్ వర్సిటీ), కౌశిక్ చౌదురి(నార్త్ ఈస్టర్స్ వర్సిటీ), మనీశ్ అరోరా(ఇకన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ ఎట్ మౌంట్ సినాయ్), ఆరాధనా త్రిపాఠి(వర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా) ఉన్నారు.