శ్రీలంక ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా రువాన్‌ కులతుంగ  | Ruwan Kulatunga Appointed As Sri Lanka Intelligence Chief | Sakshi
Sakshi News home page

శ్రీలంక ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా రువాన్‌ కులతుంగ 

Published Fri, Jun 14 2019 3:04 AM | Last Updated on Fri, Jun 14 2019 3:04 AM

Ruwan Kulatunga Appointed As Sri Lanka Intelligence Chief - Sakshi

కొలంబో : శ్రీలంక జాతీయ ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ గా మేజర్‌ జనరల్‌ రువాన్‌ కులతుంగ నియమితులు కానున్నారు. ఉగ్ర దాడుల గురించి ఇంటెలిజెన్స్‌ ముందుగానే హెచ్చరించినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోలేదని అప్పటి ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ సిసిరా మెండిస్‌ ఆరోపించడంతో అధ్యక్షుడు సిరిసేన మెండిస్‌ను తొలగించిన సంగతి తెలిసిందే. రక్షణ మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్న సిరిసేన గతవారం విచారణకు ముందే మెండిస్‌ను తొలగిస్తున్నట్లు ప్రకటించారు. జాతీయ తౌహీద్‌ జమాత్‌ జరిపిన బాంబ్‌ దాడులు అనంతరం పోలీస్‌ చీఫ్‌ పూజిత్‌ జయసుందర, రక్షణ శాఖ ఉన్నతాధికారి హేమసిరి ఫెర్నాండోలను కూడా సిరిసేన విధుల నుంచి తొలగించారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement