న్యూఢిల్లీ: సౌదీ అరేబియా నేతృత్వంలోని సంకీర్ణ దళాలు యెమెన్‌లో జరిపిన వైమానిక దాడుల్లో 13 మంది భారతీయులు ప్రాణాలతో ఉన్నట్లు భారత విదేశాంగశాఖ తెలిపింది. మరో ఏడుగురు కనిపించడం లేదని, బహుశా వారు కూడా ప్రాణాలతోనే ఉండిఉండవచ్చని అన్నారు. తొలుత యెమెన్‌లోని హొదీదా ఓడరేవులో చమురు స్మగ్లర్లను లక్ష్యంగా చేసుకుని సౌదీ దళాలు దాడులు జరిపాయని, స్థానిక జాలర్లు ఈ దాడుల్లో చనిపోయారని కొన్ని జాతీయ, అంతర్జాతీయ మీడియాల్లో వార్తలు వచ్చాయి.
మృతుల్లో దాదాపు 20 మంది భారతీయులు ఉన్నట్లు ఈ వార్తలు పేర్కొన్నాయి. ఈ 20మంది కూడా మరణించినట్లు వార్తలు వెలువడ్డాయి. కానీ, అందుకు సంబంధించిన ఎలాంటి సమాచారం తమ దగ్గర లేదని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి వికాస్ స్వరూప్ తెలిపారు. యెమెన్‌లో భారత్‌కు దౌత్యకార్యాలయం లేదు. ఈ ఏడాది ప్రారంభంలో సంక్షోభం తలెత్తినప్పుడు అక్కడి భారతీయులందరినీ స్వదేశానికి తరలించిన తరువాత, దౌత్య కార్యాలయాన్ని కూడా మూసివేశారు.
ఆ దాడుల్లో భారతీయులు చనిపోలేదు
Published Wed, Sep 9 2015 11:36 AM | Last Updated on Sun, Sep 3 2017 9:04 AM
Advertisement
Advertisement