![Snake Over Army Man Gun Photo Trending In Socoal Media - Sakshi](/styles/webp/s3/article_images/2018/04/27/Snake-With-Sniper-Gun.jpg.webp?itok=n8njGBl-)
ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన ఫొటో
పాములు.. ఆ పేరు వెంటనే ఎక్కడా ఎక్కడా! అంటూ భయంతో పరుగులు పెడతాం. కానీ దేశ ప్రజల రక్షణ కోసం శ్రమించే సైనికుల ధైర్య, సాహసాలను మెచ్చుకోవాల్సిందే. ప్రస్తుతం ఇందుకు సంబంధించి పాము-జవాన్ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇటీవల అమెరికాలో జూనియర్ ఆర్మీ జవాన్ గన్ ఫైరింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా ఓ పొడవైన పాము దగ్గరికి వచ్చింది. 1-173 ట్రైనింగ్ సమయంలో పాము అడుగు దూరంలోకి రాగా.. ఏ మాత్రం భయపడకుండా, కదలకుండా ధైర్యంగా ఉన్నారు. జవాన్ ఎంత ధైర్యవంతుడు, ఆ పరిస్థితిని ఎలా అధిగమిస్తాడో తెలుసుకునేందుకు అలబామా ఆర్మీ అధికారి ఈ పరీక్ష నిర్వహించారు.
అదే సమయంలో ఆర్మీ సిబ్బంది విలియం ఫ్రై తీసిన ఫొటోను అలబామా నేషనల్ గార్డ్ తమ ఫేస్‌బుక్ పేజీలో షేర్ చేయగా వైరల్ అవుతోంది. ఫేస్‌బుక్‌లో దీనిపై భిన్నమైన కామెంట్లు వస్తున్నాయి. వామ్మో.. నావల్ల కాదంటూ లేచి నేను ఔట్ అంటూ పరిగెత్తేవాడినని ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. అసలు అక్కడా జూనియర్ ఆర్మీ జవానా! లేక కెమెరామెనా, ఎవరు ధైర్యవంతులంటూ కామెంట్లు వస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment