అందాల పోటీల్లో ట్రాన్స్‌జెండర్‌! | Spanish Stunner Breaks Down Barriers As the First Ever transgender Miss Universe Contestant | Sakshi
Sakshi News home page

Published Sat, Dec 15 2018 12:19 PM | Last Updated on Sat, Dec 15 2018 12:42 PM

Spanish Stunner Breaks Down Barriers As the First Ever transgender Miss Universe Contestant - Sakshi

ఏంజెలా పోన్స్

బ్యాంకాంగ్‌: మిస్‌ యూనివర్స్‌ పోటీల్లో పాల్గొని ఓ ట్రాన్స్‌జెండర్‌ చరిత్ర సృష్టించింది. స్పెయిన్‌ బ్యూటీ అయిన ఏంజెలా పోన్స్ అనే 27 ఏళ్ల ట్రాన్స్‌ జెండర్.. 66 ఏళ్ల చరిత్ర గల విశ్వసుందరీ పోటీల్లో పాల్గొని ఔరా అనిపించింది. ఈ పోటీల్లో పాల్గొన్న తొలి ట్రాన్స్‌జెండర్‌ మహిళగా నిలిచింది. ట్రాన్స్‌జెండర్స్‌ సమస్యలపై గళమెత్తాడానికి తనకు ఇదే అనువైన వేదిక అనిపించిందని ఈ ట్రాన్స్‌జెండర్‌ బ్యూటీ పేర్కొంది. ముఖ్యంగా అవయమార్పిడి చేసుకున్న మహిళలకు ఎదురయ్యే సమస్యలపై అవగాహన కల్పించేందుకే పోటీల్లో పాల్గొంటున్నట్లు స్పష్టం చేసింది.

దేశ సైన్యంలో పనిచేయడానికి ట్రాన్స్‌జెండర్స్‌ పనికారారంటూ.. వారిపై నిషేధం విధిస్తూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ తీసుకున్ననిర్ణయంపై కూడా ఈ బ్యూటీ మండిపడింది. అవయవ మార్పిడి వల్ల తనకు ఆడతనం రాలేదని, పుట్టకతోనే వచ్చిందని పేర్కొంది. స్పెయిన్‌లోని స్వచ్ఛంద సేవా సంస్థలో పనిచేస్తున్న ఏంజెలా.. ట్రాన్స్‌జెండర్స్‌ పిల్లల సమస్యలపై పోరాడుతోంది. ఇక ఈ అందాల పోటీల ఫైనల్స్‌ సోమవారం థాయ్‌లాండ్‌ రాజధాని బ్యాంకాగ్‌లో జరగనున్నాయి.


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement