ఆర్మీ యూనిఫాంలో స్కూల్లోకి వచ్చిన ఉగ్రవాదులు | Terrorists Entered Pakistan School in Uniforms | Sakshi
Sakshi News home page

ఆర్మీ యూనిఫాంలో స్కూల్లోకి వచ్చిన ఉగ్రవాదులు

Published Tue, Dec 16 2014 3:12 PM | Last Updated on Sat, Sep 2 2017 6:16 PM

Terrorists Entered Pakistan School in Uniforms

కరాచీ: పాకిస్థాన్లోని పెషావర్ ఆర్మీ స్కూల్లోకి ఉగ్రవాదులు ఆర్మీ యూనిఫాంలో వచ్చినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. శ్మశాన వాటిక నుంచి ఆరుగురు ఉగ్రవాదులు స్కూలు వెనుక గేటు ద్వారా ప్రవేశించినట్టు చెప్పారు. ఉగ్రవాదులు స్కూల్లోకి ప్రవేశించిన వెంటనే ఓ వాహనానికి నిప్పు పెట్టారు. అనంతరం విచక్షణ రహితంగా కాల్పులు జరిపారని తెలిపారు. ఈ దుర్ఘటనలో వందమందికి పైగా విద్యార్థులు మరణించిగా, మరో 80 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. బాధితుల్లో టీచర్లు, పాఠశాల సిబ్బంది ఉన్నారు.

ఉగ్రవాదులు స్కూల్లోకి ప్రవేశించినపుడు పరీక్షలు నిర్వహిస్తున్నామని ఓ టీచర్ చెప్పారు.  ఉగ్రవాదులు అరగంట పాటు కాల్పులు జరిపిన అనంతరం సైన్యం పాఠశాల చుట్టుముట్టినట్టు తెలిపారు. సైన్యం స్కూల్లో నుంచి విద్యార్థులను తరలిస్తున్నట్టు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement