
టెక్సాస్: ముగ్గురు విద్యార్థులు సమయస్పూర్తితో వ్యవహరించటంతో తమతో పాటు తోటి విద్యార్థులను పెను ప్రమాదం నుంచి కాపాడగలిగారు. ఈ ఘటన అమెరికాలోని ఆగ్నేయ టెక్సాస్‌లో చోటుచేసుకుంది. సాయంత్రం స్కూల్ పూర్తయ్యాక బస్స్ డ్రైవర్ విద్యార్తులను ఎక్కించుకొని బయలుదేరాడు. స్కూల్ నుంచి బస్సు కొద్ది దూరం ప్రయాణించాక డ్రైవర్ అపస్మారకస్థితిలో ఉండటాన్ని గమనించిన విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. ఈ సమయంలో ముగ్గురు విద్యార్థులు మిగతావారిలా ఆందోళన చెందకుండా చాకచక్యంగా బస్సును సురక్షితంగా రోడ్డు పక్కకు ఆపారు. అనంతరం విద్యార్థులు డ్రైవర్‌కు ప్రాథమిక చికిత్స అందించినప్పటికీ కాపాడలేకపోయారు. విషయం తెలుసుకున్న స్కూల్ యాజమాన్యం, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విద్యార్థుల సాహసాన్ని అభినందించారు.